హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు క్షేత్రస్థాయిలో సేవలు అందడం లేదు. బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని సేవలు అందిస్తున్నామని ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నప్పటికీ.. కింది స్థాయిలో మాత్రం సేవలు ఆశాజనకంగా లేవు. కూకట్‌పల్లిలో వైరస్ బారినపడుతున్న బాధితులకు ప్రారంభంలో వైద్యాధికారులు సలహాలు ఇచ్చి వెళుతున్నారు. అనంతరం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. బాధితులకు కరోనా నివారణకు ప్రభుత్వం అందిస్తున్న కిట్లను సైతం కొన్ని ప్రాంతాల్లో అందించడం లేదు.
హోం ఐసోలేషన్ బాధితులకు వైద్యం అందని ద్రాక్షే.. - Medical services are not provided to Home Isolation victims
కూకట్‌పల్లిలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులకు వైద్య సేవలు అందడం లేదు. వైరస్ బారిన పడిన ప్రారంభంలో బాధితులకు పలు సూచనలు ఇచ్చి వెళ్తున్న వైద్యులు.. మళ్లీ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోం ఐసోలేషన్ బాధితులకు అందని వైద్య సేవలు
మరోవైపు వైరస్ నుంచి కోలుకున్న బాధితులు.. తమను ఆసుపత్రిలో బాగానే చూసుకున్నారని.. కిట్ల పంపిణీ విషయంలోనే జాప్యం జరిగిందని ఆరోపిస్తున్నారు. వైరస్ బారిన పడిన సమయంలో ధైర్యంగా ఉండాలని.. స్వీయ నియంత్రణ పాటిస్తూ.. తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను జయించవచ్చని చెబుతున్నారు.
ఇదీచూడండి: కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య