తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో జడ్పీ చైర్మన్​, వైస్ చైర్మన్​ల ప్రమాణ స్వీకారం - venkatesh

ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో జడ్పీటీసీలుగా గెలుపొందిన శరత్​చంద్రరెడ్డి, వెంకటేష్​ జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్​లుగా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.

మేడ్చల్​ జిల్లాలో జడ్పీ చైర్మన్​, వైస్ చైర్మన్​ల ప్రమాణ స్వీకారం

By

Published : Jul 5, 2019, 7:04 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ చైర్మన్​, వైస్ చైర్మన్​లుగా శరత్​చంద్రరెడ్డి, వెంకటేష్​లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరూ కలసి కట్టుగా పని చేయాలని కోరారు.

షామీర్​పేట్ జడ్పీటీసీ అనిత 'మంత్రి మల్లారెడ్డి సాక్షిగా' అని ప్రమాణం చేసేసరికి సభలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్​రావు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్​ జిల్లాలో జడ్పీ చైర్మన్​, వైస్ చైర్మన్​ల ప్రమాణ స్వీకారం
ఇదీ చూడండి:పుర'పోరు'కు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details