అసంఘటిత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంటు తెరాస ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్కేవీ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో.. 200 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. పేద కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన టీఆర్ఎస్కేవీ యూనియన్ నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - Distributed essentials to auto drivers
లాక్డౌన్తో అనేక ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలకు సాయంగా నిలిచేందుకు మేడ్చల్ టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ముందుకొచ్చారు. కష్ట కాలంలో ఉపాధి కరవైన ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
Distribution of essentials
తెరాస ప్రభుత్వం.. రోడ్డు పన్ను మాఫీ, ఉచిత ప్రమాద బీమా తదితర సౌకర్యాలను కల్పించి కార్మికులకు అండగా నిలిచిందని రాజశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం