లాక్డౌన్ సమయంలోనూ మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. విషయం గమనించిన బాలానగర్ డీసీపీ పద్మజ... తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 దాటాక కూడా వాహనదారులు రోడ్లపైకి రావడం వల్ల సుచిత్ర కూడలి వద్ద ట్రాఫిక్ ఏర్పడుతోంది.
10 దాటాక రోడ్లపైకొచ్చిన వారికి జరిమానాలు - medchal police vehicle inspections
ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ... రోడ్లపై తిరుగుతున్న వారిపట్ల మేడ్చల్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానాలు విధిస్తూ... అత్యవరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు.
10 దాటాక రోడ్లపైకొచ్చిన వారికి జరిమానాలు
సరుకు రవాణా, అత్యవసర వాహనాలకు మినహాయింపు ఇచ్చి మిగతావారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలకు బయటకు రావొద్దని డీసీపీ పద్మజ సూచించారు.