Corona in Tech Mahindra University: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పలువురు విద్యార్థులు, సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడంతో వర్సిటీకి సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో వర్సిటీని డీఎంహెచ్‌వో మల్లికార్జున్ పరిశీలించారు.
వర్సిటీలోని 25 మంది విద్యార్థులకు, ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని.. డీఎంహెచ్‌వో(medchal dmho visited tech Mahindra university) చెప్పారు. ప్రస్తుతం కరోనా బాధితులంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ సిబ్బంది, దుకాణదారులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. పాజిటివ్ వచ్చిన 30 మంది..2 డోసులు తీసుకున్నారు. -మల్లికార్జున్, మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెచ్‌వో