తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్​కౌంటర్​ చేయడంపై మేడ్చల్  న్యాయవాదుల హర్షం.. - encountering four accused disha case

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితులను ఎన్​కౌంటర్​ చేయడంపై మేడ్చల్​ బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

medchal district advocates happy about encounter
ఎన్​కౌంటర్​ చేయడంపై మేడ్చల్  న్యాయవాదుల హర్షం..

By

Published : Dec 6, 2019, 2:43 PM IST

మేడ్చల్ పట్టణంలోని సివిల్ కోర్టు ప్రాంగణంలో మేడ్చల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులకు పూల దండలు వేసి మిఠాయిలు తినిపించి ఘనంగా సన్మానించారు.

ఎన్​కౌంటర్​ చేయడంపై మేడ్చల్ న్యాయవాదుల హర్షం..

అతి కిరాతకంగా దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు తగిన శిక్ష పడటం శుభపరిణామమని బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు శివకుమార్​ అన్నారు. ఈరోజు జరిగిన ఎన్​కౌంటర్​తో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయన్నారు.

ఇవీ చూడండి: 'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకంగా చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details