మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో గత నెల 22న ఏడాది వయసున్న పాపకు కరోనా పాజిటివ్ రావడం వల్ల కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించారు అధికారులు. అక్కడి పరిస్థితులు తెలుసుకునేందు ఈ రోజు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు.
రెడ్‌జోన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన - రెడ్‌జోన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన
మేడ్చల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కంటైన్మెంచ్ ఏరియా ప్రగతి నగర్లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. లాక్డౌన్ మగిసే వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.
రెడ్‌జోన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన
కంటైన్మెంట్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేస్తున్నారు. అంతకుముందు ప్రగతి నగర్‌లోని శాంతినగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదగా కాలనీవాసులకు వారానికి సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే 20 కేసులు