తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతీ ఒక్కరూ మనిషికి మూడు మొక్కలు నాటాలి' - 'ప్రతీ ఒక్కరూ మనిషికి మూడు మొక్కలు నాటాలి'

మేడ్చల్ జిల్లా డిబబిల్​ పూర్ గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిలా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మూడు మొక్కలు నాటాలని సూచించారు.

medchal collector participated haritha haram program
'ప్రతీ ఒక్కరూ మనిషికి మూడు మొక్కలు నాటాలి'

By

Published : Jun 9, 2020, 1:10 PM IST

హరిత హారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం డబిల్ పూర్ గ్రామంలో పర్యటించి మొక్కలు నాటారు. జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తోందని కలెక్టర్ అన్నారు. హరిత హారంలో భాగంగా పంచాయతీల్లో 20 నుంచి 30 వేల మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలన్నారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మ, జడ్పీటీసీ శైలజ, సర్పంచ్ గీత, వైస్ ఎంపీపీ రజిత, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details