ఘట్కేసర్, మల్కాజిగిరి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయబోతున్నట్లు మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జీహెచ్ఎంసీతోపాటు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలుపుకుని మొత్తం 1, 200 మంది విదేశాల నుంచి వచ్చారని వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. కూలీలకు, ఇతర రాష్ట్రాల లేబర్లకు వసతితోపాటు.. భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకున్నామంటున్న మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: కలెక్టర్ వెంకటేశ్వర్లు - corona latest updates in state
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మేడ్చల్- మల్కాజిగిరి యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం'