తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమగా చూసే భర్తను చంపలేక తనువు చాలించింది - మామను పెళ్లి చేసుకోమ్మని కుమార్తెను వేధించిన తల్లి

బిడ్డ బాగు కోరాల్సిన కసాయి తల్లి... తమ్ముడి సంతోషం కోసం అల్లుడిని కడతేర్చాలని చూసింది. భర్తను చంపమని కుమార్తెకు నూరిపోసింది. తనను ప్రేమగా చూసే భర్తను చంపేందుకు మనసొప్పక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో చోటుచేసుకుంది.

ప్రేమగా చూసే భర్తను చంపలేక తనువు చాలించింది
ప్రేమగా చూసే భర్తను చంపలేక తనువు చాలించింది

By

Published : Sep 14, 2020, 5:08 AM IST

Updated : Sep 14, 2020, 10:54 AM IST

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాకు చెందిన రాములమ్మ కుమార్తె గాయత్రిని అదే ప్రాంతానికి చెందిన సైదారావు వివాహం చేసుకున్నాడు. రాములమ్మ తమ్ముడు పుల్లారావు భార్య అతడిని ఏడాది క్రితం వదిలేసింది. తన కుమార్తెను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని రాములమ్మ భావించి అల్లుడిని చంపాలని కుమార్తెను వేధించారు. తనను ప్రేమగా చూసే భర్తను చంపేందుకు మనసొప్పక గాయత్రి పురుగుల మందు తాగి తనువు చాలించింది.

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరేడ్​మెట్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినాథపురానికి చెందిన కత్తి రాములమ్మ కుమార్తె శనివారం ఆత్మహత్య చేసుకుంది. మొదట అందరూ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని భావించారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు.. విచారణ చేపట్టగా.. మహిళ రాసిన లేఖ లభ్యమైంది. మహిళ ఆత్మహత్యకు తల్లి, మేనమామ వేధింపులే కారణమని లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని పోలీసులు రిమాడ్​కు తరలించారు.

ఇదీ చదవండి:వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడులు

Last Updated : Sep 14, 2020, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details