మేడ్చల్ జిల్లా కీసరలో 300మంది జర్నలిస్టులకు మల్కాజ్గిరి తెరాస పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి నిత్యావసర సరుకులు అందించారు. మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు సరుకులు పంచిన ఆయన జర్నలిస్టుల సేవలు మరువలేనివి అన్నారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు వార్తలు చేరవేసేందుకు శ్రమిస్తున్నారన్నారు.
జర్నలిస్టులసేవలు వెలకట్టలేనివి! - Marri Rajashekhar Reddy Donates Groceries To journalists
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అత్యవసర సేవలందిస్తున్న విభాగాలతో పాటు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివన్నారు మల్కాజ్గిరి తెరాస పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి.
జర్నలిస్టులసేవలు వెలకట్టలేనివి!