తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షకు మందకృష్ణ మద్దతు - latest news of manda Krishna supports to tsrtc workers

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ​ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కూకట్​ పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షకు మందకృష్ణ మద్దతు

By

Published : Nov 12, 2019, 3:52 PM IST

మేడ్చల్​ జిల్లా కూకట్ పల్లి డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను అణచివేయలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులను, ప్రతిపక్షాలను ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు. తమ గోడు చెప్పుకునేందుకు ట్యాంకుబండ్​పై మిలియన్ మార్చ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే... మహిళా కార్మికులపై లాఠీచార్జి చేసి వారిని తీవ్ర గాయాలపాలు అయ్యేలా చేయడం దారుణమన్నారు. హైకోర్టు చెప్పినా కేసీఆర్ పట్టించుకువడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షకు మందకృష్ణ మద్దతు

ABOUT THE AUTHOR

...view details