మెదక్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన బోగ హనుమాన్ దాస్ నాలుగైదేళ్ల క్రితం కుటుంబంతో హైదరాబాద్ వచ్చి మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గణేశ్ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కుటుంబ తగాదాల కారణంగా గురువారం మధ్యాహ్నం కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేయగా స్థానికులు 100 డయల్ చేశారు. స్పందించిన పేట్‌బషీరాబాద్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వెళ్లారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - man suicide with family problems at jeedimetla
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
మనోవేదనకు గురైన అతడు రాత్రి ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం తెల్లవారుజామున కాలనీలోని అదే ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:నిర్బంధితులపై నిఘా... సమతూకమే కీలకం