మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మైసమ్మగుట్ట వద్ద మన్సూరాబాద్‌కు చెందిన సైదులు, ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి మద్యం సేవించారు. మత్తులో ఉన్న సైదులుపై యాదగిరి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలు కావడం వల్ల సైదులు అక్కడిక్కడే మృతి చెందాడు.
మద్యం తాగించి కత్తితో పొడిచి.. ప్రాణం తీసిన వివాహేతర బంధం - crime news.
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో మద్యం తాగించి కత్తితో పొడిచి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దారుణ హత్య.. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
యాదగిరి కత్తితో నేరుగా ఘట్కేసర్ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. భార్యతో మృతుడు సైదులు కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతో మద్యం సేవించేందుకు తీసుకెళ్లి హత్య చేశానని నిందితుడు పోలీసుల వద్ద నిజం ఒప్పుకున్నాడు.
ఇవీ చూడండి: భార్య డబ్బులు ఇవ్వలేదని 6నెలల బిడ్డను చంపేశాడు..