తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ శానిటైజర్‌ తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో అందరూ శానిటైజర్‌ వాడుతున్నందున జీడిమెట్లకు చెందిన వికాస్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో చూసి శానిటైజర్‌ తయారీ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Aug 22, 2020, 4:06 PM IST

నకిలీ శానిటైజర్‌ తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు
నకిలీ శానిటైజర్‌ తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధి రామిరెడ్డి నగర్‌లో నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో అందరూ శానిటైజర్‌ వాడుతున్నందున జీడిమెట్లకు చెందిన వికాస్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో చూసి శానిటైజర్‌ తయారీ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ శానిటైజర్‌

ఓ చిన్న షటర్‌లో ఈ వ్యవహారం నడుపుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 540 లీటర్ల ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, 140 లీటర్ల శానిటైజర్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.5 లక్షలుగా ఉంటుందని వెల్లడించారు. చీర్ ఫుల్ అనే బ్రాండ్‌తో ఎలాంటి అనుమతి లేకుండా శానిటైజర్‌ తయారుచేస్తున్న వికాస్‌ను పూర్తి విచారణ చేసి రిమాండ్‌కు తలిస్తామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ABOUT THE AUTHOR

...view details