Malkajgiri Lok Sabha Won Leaders as Minister: రాష్ట్రంలో ఆ నియోజకవర్గంలో గెలుపొందిన అభ్యర్థులు రాజకీయంగా కలిసివస్తోంది. ఇప్పటివరకు ఆ స్థానం నుంచి పోటీ చేసిన నాయకుల్లో ముగ్గురు వ్యక్తులు విజయం సాధించారు. వారిలో ఒకరు రాష్ట్ర మంత్రి పదవిని చేపడితే, మరొకరు కేంద్ర మంత్రి హోదాలో పని చేశారు. ఇంకో అభ్యర్థి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాయకులకు అదృష్టం కలిసివస్తోందన్న భావన అందరిలో ఏర్పడిపోయింది. అదే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం.
'ప్రజల కోసం పనిజేసిన - నా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన - మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తా'
Revanth Reddy From Malkajgiri Lok Sabha : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(Redistribution of Lok Sabha constituencies)లో భాగంగా 2009వ సంవత్సరంలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం(Malkajigiri Lok Sabha Constituency) ఏర్పాటైంది. ఈ స్థానం నుంచి మూడు ఎన్నికల్లో రికార్డులు సృష్టించింది. ఇక్కడి నుంచి గెలపొందిన నాయకులకు అదృష్టం కలిసి వస్తోందన్న సెంటిమెంట్ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలో అతి పెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన మల్కాజిగిరి నియోజకవర్గంలో సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. తమ రాజకీయ జీవితంలో కీలక పదవులను అధిరోహించారు. మంత్రులు, ముఖ్యమంత్రి హోదాను పొందారు.
తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా
- 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ పోటీచేసి విజయం సాధించారు. ఆ లోక్‌సభ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 93 వేల మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత 2012లో కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా చేశారు.
- 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తొలిసారిగా మల్కాజిగిరి నుంచే లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డినే. రాజకీయ సమీకరణాలతో ఆయన 2016లో బీఆర్ఎస్లో తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 2023లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. తన రాజకీయ ఉన్నతికి మల్కాజిగిరి లోక్‌సభ ఒక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.
- 2018లో శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం 2019 ఏప్రిల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఎంపీగా కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర కాంగ్రెస్లో కీలక బాధ్యతలు స్వీకరించారు. 2023లో జరిగి శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కొడంగల్, కామారెడ్డి పోటీ చేశారు. ఇందులో కొడంగల్ నుంచి విజయం సాధించారు. సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?
Minister Mallareddy Dance in Kukatpally : మరోసారి డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్