మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి 140డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు రావడం కలకలం రేపింది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో చొరబడటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్నగర్ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెబుతూ ఇంట్లోకి చొరబడ్డారని... ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆరోపించారు.
అర్ధరాత్రి పోలీసులు రావడం కక్ష సాధింపు చర్య: కార్పొరేటర్ శ్రవణ్ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
కార్పొరేటర్ శ్రవణ్ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు రావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో చొరబడటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు.

అర్ధరాత్రి పోలీసులు రావడం కక్ష సాధింపు చర్య: కార్పొరేటర్ శ్రవణ్
ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ శ్రవణ్ ఇంట్లో లేకపోవడం వల్ల మరో ముగ్గురు బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు శ్రవణ్ తండ్రి రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం