తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​లో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం - congress protest for farmers

రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్​ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​ ముట్టడించడానికి వెళ్తున్న మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నందికంటి శ్రీధర్​ను పోలీసులు అడ్డుకున్నారు.

malkajgiri congress incharge sridhar is arrested
మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నందికంటి శ్రీధర్​

By

Published : Nov 12, 2020, 2:02 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరి విడనాడాలని కోరుతూ రైతుమహా ప్రదర్శన ధర్నా పేరిట కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నందికంటి శ్రీధర్​ను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.

రైతుల కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడం సరైన చర్య కాదని శ్రీధర్ అన్నారు. తెలంగాణ సర్కార్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. కనీస మద్దతు ధర కోసం రోడ్లపైకి వచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అన్నదాతల సమస్యలు తీరే వరకు తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details