తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కార్మికులకు బత్తాయి పండ్ల పంపిణీ - తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్​ రెడ్డి

ఘట్​కేసర్​ రైల్వే స్టేషన్​లో 3వేల మంది వలస కార్మికులకు తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్​ రెడ్డి బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ పండ్లను తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.

Malkaghiri Parliament Member Marri Rajshekar reddy Distributes Battai Fruits for Migrant Labours in Ghatkesar railway Station
వలస కూలీలకు బత్తాయి పండ్ల పంపిణీ

By

Published : May 16, 2020, 1:09 PM IST

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో సుమారు 3వేల మంది వలస కార్మికులకు తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు పాల్గొని కూలీలకు పండ్లు అందించారు. విటమిన్‌ సి అధికంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details