కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, అఖిలపక్ష నేతలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను గృహనిర్బంధం చేశారు.
డీసీసీ అధ్యక్షుడు కూనశ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్ - కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు
డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, అఖిలపక్ష నేతలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు.
డీసీసీ అధ్యక్షుడు కూనశ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పొట్ట కొట్టేలా ఉందని ఆయన ఆరోపించారు. పోలీసులు ప్రతిదానికి ఇలా హౌస్ అరెస్టులు చేయడం సమంజసం కాదని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు కార్యకర్తలు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు.
ఇదీ చూడండి:వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు