ETV Bharat / state
నిన్న పెళ్లి.. నేడు ఆత్మహత్యాయత్నం - vhp
నిన్న మేడ్చల్ జిల్లా కండ్లకోయ సమీపంలో ఆక్సిజన్ పార్కులో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది.


బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట
By
Published : Feb 15, 2019, 9:28 PM IST
| Updated : Feb 16, 2019, 11:12 AM IST
బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాకు యత్నించారు. నిన్న మేడ్చల్ జిల్లా కండ్లకోయ సమీపంలో ఆక్సిజన్ పార్కులో ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ప్రేమికుల రోజు భారతీయ సంప్రదాయం కాదని పార్కులో కనిపించిన ఈ జంటకు బలవంతంగా మూడుముళ్లు వేయించారు. బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట ఆత్మహత్యాకు యత్నించింది. అక్కడే ఉన్న లేక్ పోలీసులు వీరిని కాపాడారు. ప్రేమజంటకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఘటనతో బజరంగదళ్ కార్యకర్తల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Last Updated : Feb 16, 2019, 11:12 AM IST