తెలంగాణ

telangana

ETV Bharat / state

లాటరీ స్కీమ్​ పేరుతో కోటిన్నరకు టోకరా

నెలనెలా ఒక్కొక్కరితో రూ. 1000 కట్టించుకున్నాడు. అలా 8నెలల్లో సుమారు కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి ఓ సంస్థ నిర్వాహకుడు ఉడాయించాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు సదురు సంస్థ కార్యాలయం ముందు ఆందోళకు దిగారు.

కోటిన్నరకు టోకరా

By

Published : Jul 26, 2019, 5:48 PM IST


లాటరీ స్కీమ్​ పేరుతో ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఘటన మేడ్చల్ జిల్లా బాలానగర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు సుమారు 100 మంది సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన గోపాల్​రావు 15 సంవత్సరాల క్రితం భార్య, పిల్లలతో కలసి నగరంలో స్థిరపడ్డాడు.

సంస్థ ఏర్పాటు చేసి..

బాలానగర్ పరిధిలోని పద్మానగర్ ఫేస్ -1లో ఓ షాపును అద్దెకు తీసుకొని మరో ముగ్గురు వ్యక్తులు నరేందర్​, శివ, సత్యం భాగస్వాములుగా "వినాయక ఎంటర్‌ప్రైజెస్ " అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 2000 మంది సభ్యులతో లాటరీ స్కీమ్ పెట్టారు. ఒక్కొక్కరితో నెల నెల రూ. 1000/- కట్టించుకుంటూ.. ప్రతినెల 10మంది సభ్యులకు లాటరీ స్కీమ్ ద్వారా గిఫ్ట్​లు ఇచ్చేవారు.

8నెలల్లో కోటి అరవై లక్షలు..

మూడు నెలల క్రితం ముగ్గురు భాగస్వాములు నిందితుడు గోపాల్​రావుతో విడిపోయి వేరే బోగస్ సంస్థను ఏర్పాటు చేసుకున్నా... గోపాల్ మాత్రం 'వినాయక ఎంటర్‌ప్రైజెస్ ' సంస్థను కొనసాగిస్తూ వచ్చాడు. 8నెలలలో సుమారు కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసాడు. ఈరోజు సభ్యుల సమక్షంలో లాటరీ తీయకుండా కార్యాలయం మూసివేసి ఉండటం వల్ల సుమారు 100మంది బాధితులు గోపాల్​రావు ఇంటిముందు ఆందోళన చేపట్టారు. బోగస్ సంస్థ నిర్వాహకున్ని వెంటనే అరెస్టు చేసి.. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

కోటిన్నరకు టోకరా

ఇవీ చూడండి: 'కొత్త అసెంబ్లీ నిర్మాణ నమూనాలు ఇంకా ఖరారు కాలేదు'

ABOUT THE AUTHOR

...view details