తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి - lorry hits bike one man died in medchal

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యభర్తలను లారీ ఢీకొట్టిన ఘటన దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్రగాయాలపాలయ్యింది.

lorry hits bike one man died in medchal
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

By

Published : Jan 8, 2020, 5:24 AM IST

మేడ్చల్ జిల్లా రాయిలపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై కుత్బుల్లాపూర్ నుంచి వారి గ్రామానికి బయలుదేరారు. బహదూర్​ పల్లి వద్దకు రాగానే వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్​రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీకి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details