తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో పటిష్ఠంగా అమలవుతున్న లాక్​డౌన్ - police vehicle checkings in medchal

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి.

lockdown strictly implemented in medchal district
మేడ్చల్​ జిల్లాలో పటిష్ఠంగా అమలవుతున్న లాక్​డౌన్

By

Published : May 26, 2021, 11:59 AM IST

కరోనా వైరస్‌ కట్టడి చర్యలో భాగంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, రామంతాపూర్‌, బోడుప్పల్, హబ్సిగూడ, పిర్జాదిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న సడలింపు సమయంలో మాత్రమే ఆయా ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఆ తరువాత పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ... ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు.

కరోనా రెండో డోసు టీకా తీసుకునేందుకు వెళ్తున్న వారికి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. ఉప్పల్‌ కూడలిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. చౌదరిగూడ పంచాయతీ కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి... ఆటోకు మైక్‌ పెట్టించి మరీ కరోనా నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైద్యుల సూచనలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

ABOUT THE AUTHOR

...view details