కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అల్వాల్ మున్సిపల్ ఉపకమిషనర్ తిప్పర్తి యాదయ్య తెలిపారు. అందులో భాగంగా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.
మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నవారికి జరిమానా - fine to people without mask in hyderabad
సికింద్రాబాద్ అల్వాల్ ప్రాంతంలో మాస్కులు లేకుండా తిరిగిన వారిపై మున్సిపల్ ఉపకమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. అల్వాల్‌లో దుకాణాల వద్ద మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నారనే సమాచారంతో తనిఖీ చేసిన అధికారులు... నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.
మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నవారికి జరిమానా
ఈ మేరకు ... అల్వాల్‌లోని సూపర్ మార్కెట్లు, కూరగాయల దుకాణాల వద్ద మాస్కులు లేకుండా తిరుగుతున్నారని అధికారులకు సమాచారం వచ్చింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అలాంటి వారిని గుర్తించి వారికి జరిమానా విధించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు అల్వాల్ మున్సిపల్ ఉపకమిషనర్ స్పష్టం చేశారు..
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం
TAGGED:
fine to people without mask