మేడ్చల్ జిల్లా బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేట్ పార్కులో డంపింగ్ యార్డ్ నిర్మాణం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో.. నిర్మాణాన్ని నిలిపి వేయాలంటూ డిమాండ్ చేశారు.
'జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నిర్మించొద్దు'
మేడ్చల్ జిల్లా బోయిన్‌పల్లిలోని ఓ పార్కులో.. డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. సిబ్బందికి, అధికారులకు పూలు అందజేసి నిర్మాణాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
'జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నిర్మించొద్దు'
స్థానికులు నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికి యార్డు నిర్మాణానికి పూనుకోవడం పట్ల భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుకునే ప్రదేశంలో యార్డ్‌ను నిర్మిస్తే.. పిల్లలు ఇబ్బంది పడతారన్నారు. పార్క్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో ఆదాయం 'జూమ్'