పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ జిల్లా నేరేట్మెట్ దీన్ దయాళ్‌నగర్‌లో నాలాలో పడి మృతిచెందిన సుమేధ తల్లిదండ్రులను పరామర్శించడానికి రేవంత్ వచ్చారు. అనంతరం నాలాను పరిశీలన వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
రహదారుల సమస్యపై రేవంత్‌ను నిలదీసిన స్థానికుడు.. మిమ్మల్ని గెలిపించుకోవడం.. తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే తెరాస వ్యక్తి కావడం.. ఎంపీ కాంగ్రెస్‌కు చెందిన వారు కావడం వల్ల అభివృద్ధి కుంటుపడిందంటూ రేవంత్ ముందే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.