పుర ఎన్నికల ప్రచారానికి తెరపడి, ప్రలోభాల పర్వం మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు మద్యం, డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ పురపాలిక సంఘం 14వ వార్డులో ఓటర్లకు అందించేందుకు ఓ ఇంట్లో మద్యాన్ని నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న పుర ఎన్నికల విభాగం ప్రత్యేక బృందం ఆ ఇంటిపై దాడి చేసి 410 మద్యం సీసాలను, ఒక చరవాణీని స్వాధీనం చేసుకుంది. పంపిణీ చేస్తున్న వ్యక్తి అధికార పార్టీకి నాయకుడనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
'పుర' ఎన్నికల వేళ.. మద్యం స్వాధీనం - Liquor Seiz
మేడ్చల్ మున్సిపాలిటీ 14వ వార్డులోని ఓ ఇంటిలో ఓటర్లకు పంచేందుకు నిల్వ ఉంచిన మద్యాన్ని పుర ఎన్నికల విభాగం ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. మద్యాన్ని దాచిన వ్యక్తి అధికార పార్టీ నాయకుడనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Liquor Seized Medchul
ఇవీ చూడండి : 'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి'