తెలంగాణ

telangana

ETV Bharat / state

నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు.. వెళ్లిపోతున్నా.. నాకోసం వెతకొద్దు - విధులకు వెళ్లిన యువతి అదృశ్యం

ఎప్పటిలాగే విధులకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఓ సూపర్​ మార్కెట్​లో ఉద్యోగం చేస్తున్న సదరు యువతి ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్​ వస్తోంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు..
నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు..

By

Published : Dec 19, 2019, 7:29 PM IST

Updated : Dec 19, 2019, 10:04 PM IST

విధులకు వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది. మల్లంపేట్ గ్రామానికి చెందిన నిక్కల గాయత్రి.. స్థానిక రత్నదీప్ సూపర్ మార్కెట్​లో క్యాషియర్​గా విధులు నిర్వహిస్తోంది.

అమ్మాయికి ఈనెల 8న వారి బంధువైన సతీశ్​తో నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి ఇష్టం లేదని విజయనగరం అబ్బాయితో వెళ్తున్నానని ఉత్తరంలో రాసిందని బంధువులు వివరించారు. బుధవారం మధ్యాహ్నం ఎప్పటిలాగే విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన గాయత్రి.. రాత్రి 10 గంటల వరకు ఇంటికి రాలేదు. యువతికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడం వల్ల ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విధులకు వెళ్తున్నానని చెప్పిన యువతి

ఇవీ చూడండి: నగరవాసులను రారమ్మంటున్న జంగిల్​ ఫారెస్ట్​ క్యాంప్​

Last Updated : Dec 19, 2019, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details