kukatpally MLA visit development works నియోజకవర్గంలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బాలాజీనగర్ డివిజన్లో పర్యటించిన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును పరిశీలించారు. కేవలం డివిజన్ వాసులకే నామమాత్రపు రుసుముతో కేటాయించాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం కేపీహెచ్‌బీ ఫోర్త్ ఫేజ్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆరోఫేజ్లోని బతుకమ్మ కుంట పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. పీవీ నరసింహారావు పార్కులోని ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు
అనంతరం ఆరో ఫేజ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన అన్ని విభాగాల అధికారులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. కేపీహెచ్‌బీ డివిజన్ అసోసియేషన్ అందరి సభ్యులందరితో అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరచాలని అసోసియేషన్ సభ్యులను ఆయన కోరారు. దీంతో వారికి ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు.