రాష్ట్రం బాగుపడుతుంటే కాంగ్రెస్, భాజపాకు నచ్చడం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్కు వచ్చిన భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారని తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గ తెరాస విసృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇది తెలంగాణ బిడ్డల అడ్డ అని... ఇక్కడ కర్ణాటకలో వేసిన నాటకాలు సాగవని అన్నారు. తెరాస ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకమైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ నడవవు: కేటీఆర్ - ktr speech
ఇప్పటి వరకు 50 లక్షల మంది తెరాస సభ్యత్వం తీసుకున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే తెరాస బలమని పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ తెరాస విసృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ktr