KTR Interesting Comments on PM Narendra Modi in Dundigal :ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలనే వారని.. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం ఇండ్లు నేనే కట్టిస్తా.. వివాహం నేనే చేయిస్తానని అంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో రూ.50,000 కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తుందని తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటీఆర్ (KTR) పంపిణీ చేశారు. ఈ రోజు 9 ప్రాంతాల్లో మంత్రులు మేయర్ ఆధ్వర్యంలో రెండో విడతగా 13,300 ఇండ్లను పంపిణీ చేస్తున్నారని ఆయన వివరించారు.
KTR Distributed Double Bedroom Houses Dundigal : ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 500, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి 300, సనత్‌నగర్ నియోజకవర్గానికి 500, కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు కేటీఆర్ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ (Double Bedroom Houses) ఎంతో పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలికి ఇల్లు వచ్చిందని వెల్లడించారు.
ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల లోపు గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా అని ప్రశ్నించారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించాలని కోరారు. దిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దనికేటీఆర్ వ్యాఖ్యానించారు.