రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తీసేసి సీఈవోలను నియమించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు గార్డెన్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ల సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల శ్రమ మరువలేనిదని.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఉద్యోగులు నిర్విరామంగా కృషి చేశారని ప్రశంసించారు.
'రేపు సింగరేణి, బీఎచ్ఈఎల్లను కూడా అమ్మేస్తారు' - మేడ్చల్ జిల్లా కండ్లకోయ వార్తలు
భాజపా ప్రభుత్వం రేపు సింగరేణి, బీఎచ్ఈఎల్ సంస్థలను కూడా అమ్మేస్తుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ చేస్తున్న పోరాటంలో మనం కూడా భాగస్వాములం అవుదామని కోరారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం లాభదాయకంగా ఉన్న సంస్థలను అమ్మేస్తుందని విమర్శించారు. విశాఖపట్నంలోని ఉక్కు పరిశ్రమని అమ్ముతామని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేపు సింగరేణి, బీఎచ్ఈఎల్ సంస్థలను కూడా అమ్మేస్తారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ చేస్తున్న పోరాటంలో మనం కూడా బాగస్వాములం అవుదామని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ అడగకుండానే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, జీతాలు అందజేస్తారని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
ఇదీ చూడండి :లైవ్ వీడియో: సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి