మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కేఎన్‌ఆర్ విల్లా వాసులు, రిటైర్డ్ ఎస్‌పీ ఆధ్వర్యంలో తిండిలేక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 200 మంది పేదలు, కూలీలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ, బాచుపల్లి సీఐ జగదీశ్వర్ పాల్గొన్నారు.
నిజాంపేట్‌లో నిత్యావసరాలు పంపిణీ - నిజాంపేట్‌లో నిత్యావసరాల పంపిణీ
లాక్‌డౌన్ నేపథ్యంలో నిజాంపేట్‌లో కేఎన్‌ఆర్ గ్రీన్ విల్లా, రిటైర్డ్ ఎస్‌పీ మూర్తి సంయుక్తంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వలస కూలీలు, భవననిర్మాణ కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
నిజాంపేట్‌లో నిత్యావసరాలు పంపిణీ
కరోనా కట్టడిలో భాగంగా అధికారులకు సహకరించాలని... అనవసరంగా బయటికి రావద్దని ప్రజలకు సీఐ సూచించారు. అందరూ ఇంటికే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రిటైర్డ్ ఎస్‌పీ అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ... కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొవాలని కమీషనర్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నార్తుల ఆకలి తీర్చడానకి దాతలు ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి:కరోనాను మోసుకెళ్తూ... పోలీసులకు చిక్కారు..!