తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనఊపిరితో ఉన్న వ్యక్తిని కాపాడిన కీసర పోలీసులు

మేడ్చల్ జిల్లా నాగారం సమీపంలోని రాంపల్లి ఆర్​ఎల్​ నగర్ చెరువు సమీపంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కీసర పోలీసులు కాపాడారు. ఉపాధి కోసం అసోం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిరంజన్‌ అనే వ్యక్తి... ఆకలితో అలమటిస్తూ చెట్లపొదల్లో పడిపోయారు. గమనించిన కీసర పెట్రోలింగ్‌ పోలీసులు... ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ప్రథమ చికిత్స అందించారు.

Keesara police rescued a man,  Medchal district
మానవత్వం చాటుకున్న కీసర పోలీసులు, పోలీసుల మానవత్వం,

By

Published : Jun 26, 2021, 12:29 PM IST

అపస్మారక స్థితిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను మేడ్చల్​ జిల్లా కీసర పోలీసులు కాపాడారు. ఉపాధి కోసం అసోం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిరంజన్‌ అనే వ్యక్తి... నాగారం సమీపంలోని రాంపల్లి ఆర్​ఎల్​ నగర్ చెరువు సమీపంలో ఆకలితో అలమటిస్తూ చెట్లపొదల్లో పడిపోయారు. అది గమనించిన స్థానికులు కీసర పోలీసులకు సమాచారం అందించారు.

మానవత్వం చాటుకున్న కీసర పోలీసులు, పోలీసుల మానవత్వం,

వెంటనే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్​ పోలీసులు... ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం బాధితున్ని యాప్రాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిరంజన్‌ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా... సకాలంలో స్పందించిన కీసర పోలీసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను... స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.

ఇదీ చదవండి: కాసేపట్లో పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యాచరణపై సీఎం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details