రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులను క్వారంటైన్ చేయడానికి మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని హశ్విత కళాశాలలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి వస్తోన్న ప్రయాణికులను నేరుగా అక్కడికి తరలిస్తున్నారు.
కీసరలో ఐసోలేషన్ సెంటర్ను తొలగించాలని ఆందోళనలు - telangana corona virus cases
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశాల నుంచి వస్తున్నవారిని క్వారంటైన్ చేయడానికి మేడ్చల్ జిల్లా కీసరలో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. హశ్విత కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ను అక్కణ్నుంచి తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు.
'కీసరలో ఐసోలేషన్ సెంటర్ను తొలగించాలి'
తమ ప్రాంతంలో ఐసోలేషన్ సెంటర్ను తొలగించాలని స్థానికులు నిరసనకు దిగారు. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి తమకు కరోనా సోకే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :కరోనా ఎఫెక్ట్: ఇక దగ్గినా, తుమ్మినా సెలవే