KCR Medchal Jadcherla Tour Today : అభ్యర్థుల ప్రకటనలో మిగతా పార్టీల కంటే ముందడుగు వేసిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ తనదైన శైలితో దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ పార్టీ నెలల క్రితమే సిద్ధమైంది. సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభాలు, శంఖుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్లింది. సెంటిమెంట్లను విశ్వసించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS).. శ్రావణమాసం ప్రారంభం రోజు.. ఒకేసారి 115 మంది అభ్యర్థులతో తమ సైన్యాన్ని ప్రకటించారు. అసమ్మతి, అసంతృప్తులను కొన్నిచోట్ల బుజ్జగించి.. మరికొన్ని చోట్లపట్టించుకోకుండా తేలిగ్గా తీసుకుంది.
BRS Election Campaign Telangana 2023: అభ్యర్థుల ఖరారు పార్టీలో సర్దుబాట్ల కొలిక్కి రాగానే.. ప్రచారంపై దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థులకు ప్రచార సామాగ్రి చేరవేసింది. గడువు ముగిసేలోగా ప్రతి ఓటరును కనీసం మూడు, నాలుగుసార్లు కలవాలని అభ్యర్థులకు పార్టీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోపే సగం ప్రచారం చేయాలన్న అధిష్టానం వ్యూహంతో.. అభ్యర్థులు ప్రజల బాటపట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్లు(MLA Tickets) ప్రకటించగానే అసంతృప్తులు, అసమ్మతి నేతలతో పాటు మండల స్థాయి నాయకులను కలిసి మద్దతు కోరారు.
CM KCR Jadcherla Tour Today :కాలనీలు, బస్తీ, కుల సంఘాల పెద్దలను కోరి ఆశీర్వదించండని అభ్యర్థిస్తున్నారు. కాలనీల్లో పాదయాత్రలు, పర్యటనలతో అభ్యర్థులు తీరిక లేకండా గడుపుతున్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలు రంగంలోకి దిగారు. అభ్యర్థులు, ఇతర నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూ.. ప్రచార ప్రణాళికలను(Election Campaign) పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ మళ్లీ గెలిస్తే చేయబోయే పనులపై హామీ ఇస్తున్నారు. కేసీఆర్‌కి జ్వరం వచ్చిన సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు,కవిత ముమ్మర ప్రచారం నిర్వహించారు. కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao) ఇద్దరూ కలిసి సుమారు 60 నియోజకవర్గాల్లో వరస పర్యటనలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కవిత దృష్టిసారించారు.