కార్తికమాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివ నామస్మరణతో మార్మోగుతోంది.
శివ నామస్మరణతో మార్మోగిన కీసరగుట్ట - మేడ్చల్ జిల్లా లేటెస్ట్ న్యూస్
కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాల్లో సందడి నెలకొంది. వేకువజాము నుంచే శివాలయాలకు భక్తులు బారులు తీరారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివ నామస్మరణతో మార్మోగుతోంది.
శివ నామస్మరణతో మారుమోగుతున్న కీసరగుట్ట
భక్తులు ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో శివలింగానికి దీపారాధన చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు
TAGGED:
karthika masam pooja 2020