కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. తాళంవేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి సొత్తు ఎత్తుకెళ్లారు. నాగారం సాయిధరణి కాలనీకి చెందిన ప్రసాద్ నిన్నరాత్రి సమయంలో కుటుంబసభ్యులతో సహా చార్మినార్‌వద్ద షాపింగ్‌కు వెళ్లాడు. తెల్లవారుజామున ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలకు వెళ్లిచూడగా సుమారు లక్షా పదివేల నగదు, 11 తులాల బంగారు నగలు, ఓ చరవాణి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు, డాగ్స్వాడ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాళం పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన కేడీగాళ్లు - chory
ఇంటి తాళం పగలగొట్టి 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన ఘటన కీసర ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
తాళం పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన కేడీగాళ్లు