తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లో ఒంటరి మహిళ టార్గెట్.. ఆరున్నర తులాల ఆభరణాల చోరీ - మేడ్చల్​ పేట్​బషీరాబాద్ గణేశ్​ హౌసింగ్ కాలనీలో చోరీ

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేశారు. ఆమెను బంధించి సుమారు ఆరున్నర తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పేట్​బషీరాబాద్​లో జరిగింది.

jewellery stolen at petbasheerbhag ganesh housing colony in medchal
ఇంట్లో ఒంటరి మహిళ టార్గెట్.. ఆరున్నర తులాల ఆభరణాల చోరీ

By

Published : Oct 9, 2020, 12:40 PM IST

మేడ్చల్​ పేట్ ​బషీరాబాద్ గణేశ్​ హౌసింగ్ కాలనీలో ఉంటున్న వినోద అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. గాయపరిచి బంధించిన అనంతరం తన మెడలో పుస్తెలతాడు, బీరువాలో ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. సుమారు ఆరున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో తెలిసిన వ్యక్తులే ఇంట్లో ఎవరూ లేరని గమనించి చోరీ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:ఉద్రిక్తతకు దారితీసిన భూవివాదం.. ఈదుల నాగులపల్లిలో ఘర్షణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details