దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నుంచి 82 వేల 748 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీ వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. తొలిరోజు ఆర్కిటెక్చర్, ప్లానింగ్ పరీక్ష ఉండగా రెండోతేదీ నుంచి బీటెక్, బీఈ పరీక్ష ఉంటుంది.
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్ష ప్రారంభం
జేఈఈ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే విద్యార్థులను లోనికి అనుమతిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారి కోసం అధికారులు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.
కొవిడ్ లక్షణాలు ఉన్నవారి కోసం అధికారులు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులందరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పలు నిబంధలను అమలు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా నాచారంలోని అయాన్ డిజిటల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతిస్తున్నారు.