దేశవ్యాప్తంగా రెండోరోజు జరుగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
రెండోరోజు జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభం - JEE Main Exam started at Medchal District Malkajgiri
మెయిన్ పరీక్ష మొదటిరోజు ప్రశాంతంగా ముగియడంతో.. అధికారులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. మల్కాజిగిరి మౌలాలిలో రెండోరోజు జేఈఈ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది.

రెండోరోజు జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభం
మేడ్చల్ జిల్లా మౌలాలిలోని టీఎస్ అయాన్ డిజిటల్ జోన్లో రెండోరోజు జేఈఈ పరీక్ష జరుగుతుండటం వల్ల ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. కొవిడ్ 19 నియమాలను పాటిస్తూ పరీక్ష రాసేందుకు వచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్‌తో లోపలికి అనుమతినిచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే లోనికి పంపించారు.
ఇదీ చూడండి:మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం
Last Updated : Sep 2, 2020, 9:34 AM IST
TAGGED:
Medchal District news