మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్లోని కుషాయిగూడ బస్టాండ్ జనసేన జెండాను తొలగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు. పది రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు. రెండు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు జెండాను తొలగించారు.
జనసేన జెండా తొలగించారంటూ ఫిర్యాదు - janasena news
మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్లోని కుషాయిగూడ బస్టాండ్ వద్ద జనసేన జెండాను తొలగించారంటూ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యకులు జెండాను ఆవిష్కరించారు. జెండాను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
జనసేన జెండా తొలగించారంటూ ఫిర్యాదు
జెండాను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుషాయిగూడ పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్లో తామే గెలుస్తామని జనసేన చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు కార్తీక్ తెలిపారు.