తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్‌గా మూడోసారి ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జగద్గిరిగుట్ట తెరాస కార్పొరేటర్ జగన్. డివిజన్లో ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించానని... మరోసారి అవకాశం ఇచ్చినందున స్థానికంగా ప్రధాన సమస్య అయిన బస్టాండ్‌ను నిర్మిస్తామని తెలిపారు.
'మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు' - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
జగద్గిరిగుట్ట డివిజన్లో తెరాస అభ్యర్థి జగన్ విజయం సాధించారు. మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
'మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు'
గెలుపు సందర్భంగా పలువురు తెరాస నేతలు మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాజపా-తెరాసల మధ్య పోటీ