'ఇంటర్' పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య - పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య
17:46 February 23
'ఇంటర్' పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్మీడియట్ పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని సూరారంలో చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయనే భయంతో కీర్తి ప్రియ(17)ఇంట్లో చున్నీతో ఉరేసుకుంది. 2018లో తన ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. గత సంవత్సరం పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించలేదు. తిరిగి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించనేమోననే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే కీర్తిప్రియ చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది.. కారకులెవరు?