తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా తొలి రోజు ఇంటర్​ పరీక్షలు - telangana inter exams

ఇంటర్​ ప్రథమ సంవత్సరం తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పక్కా ఏర్పాట్లు చేసిన ఇంటర్​ బోర్డు... కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్​ విధించారు.

inter exams
ప్రశాంతంగా తొలి రోజు ఇంటర్​ పరీక్షలు

By

Published : Mar 4, 2020, 7:26 PM IST

మేడ్చల్​ జిల్లాలో తొలి రోజు ఇంటర్​ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక్క నిమిషం నిబంధన కారణంగా మల్కాజిగిరి, నేరెడ్​మేట్​, ఈసీఐల్​లోని పరీక్ష కేంద్రాల వద్దకు గంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు.

గత అనుభవాల దృష్ట్యా ఇంటర్​ బోర్డు పక్కా ఏర్పాట్లు చేసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, ఘట్​కేసర్​లోని కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నరు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్​ విధించారు.

ప్రశాంతంగా తొలి రోజు ఇంటర్​ పరీక్షలు

ఇవీచూడండి:మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details