తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియాలో డ్రోన్ కెమెరాల ఏర్పాటు - drone cameras using in mmechal cluster area

మేడ్చల్ జిల్లా కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియా "కళావతి నగర్"లో ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని సీఐ బాలరాజు తెలిపారు.

drone cameras using in medchal
కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియాలో డ్రోన్ కెమెరాల ఏర్పాటు

By

Published : Apr 17, 2020, 6:46 PM IST

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియా "కళావతి నగర్"లో డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినా, వాహనాలపై తిరిగినా, గుంపులుగా కూర్చున్నా డ్రోన్ కెమెరా ద్వారా వెంటనే వారిని గుర్తించి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని సీఐ బాలరాజు తెలిపారు.

బాలానగర్ జోన్​లో మొదటి సారిగా డ్రోన్ కెమెరా ప్రయోగం జరిగిందని, ప్రజలు లాక్​డౌన్​కు సహకరించి కరోనాను తరిమి కొట్టాలని సూచించారు. డ్రోన్ కెమెరాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:లాక్​డౌన్​ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details