చెరువు బఫర్ జోన్లో ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వాటిని అధికారులు కూల్చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధిలోని మల్లంపేటలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస అనే ప్రైవేటు నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టింది. అయితే పక్కనే ఉన్న కత్వ చెరువు బఫర్ జోన్లో కూడా విల్లాల నిర్మాణం చేపట్టగా.. స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Villas demolition: చెరువు బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం.. కూల్చేసిన అధికారులు - తెలంగాణ వార్తలు
మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం మల్లంపేట చెరువు బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాలను అధికారులు కూల్చేశారు. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టడం అక్రమమని చెప్పారు. బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణం చేపట్టొద్దన్నారు.
కూల్చివేత
స్పందించిన ఇరిగేషన్ అధికారులు పరిశీలన చేశారు. బఫర్ జోన్లో ఏడు విల్లాలు అక్రమంగా నిర్మిస్తున్నట్లు గుర్తించారు. వాటిని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కలిసి జేసీబీ సాయంతో వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రెండు విల్లాలను నేలమట్టం చేయగా మిగతా ఐదు కూల్చాల్సి ఉంది. బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:Ind Vs Eng: టీమ్ఇండియాలో మరొకరికి కరోనా.. ఐదో టెస్టు డౌటే