ఏపీలోని విజయవాడకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. బాచుపల్లి నుంచి విజయవాడకు మద్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.
Illegal alcohol: బాచుపల్లి టు విజయవాడ.. అక్రమ మద్యం సరఫరా - Telangana news
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఏపీలోని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం
డీసీఎం డ్రైవర్ సత్యనారాయణ, మద్యం సరఫరాదారు జానయ్యలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని బాచుపల్లి పోలీసులకు అప్పజెప్పారు. డీసీఎం వాహనంతో పాటు మందు బాటిల్స్‌ను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉండవచ్చని పోలీసుల అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:CJI Justice NV Ramana: శ్రీశైలం సందర్శనలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ