మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం దేవర యాంజల్లోని సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన భూములను అధికారుల బృందం పరిశీలించింది. దేవాలయానికి చెందిన 1,521ఎకరాల 13గుంటల భూమి అన్యాక్రాంతంపై ప్రభుత్వం వేసిన ఐఏఎస్ కమిటీ సభ్యులు పరిశీలించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ శ్వేతా మహంతి, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకెరీ, ఏసీబీ, విజిలెన్స్, దేవాదాయ శాఖ అధికారులు... భూములపై ఆరా తీశారు.
దేవరయాంజల్లో భూములు పరిశీలించిన ఐఏఎస్ బృందం - మంత్రి ఈటల రాజేందర్ భూ తగాదాలు
దేవరయాంజల్ గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ భూములను అధికారులు పరిశీలించారు. ఆ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆరా తీశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో పర్యటించారు.
![దేవరయాంజల్లో భూములు పరిశీలించిన ఐఏఎస్ బృందం Devarayanjal village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11650187-thumbnail-3x2-collector--rk.jpg)
Devarayanjal village
భూమలు వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 మంది తహసీల్దారులతో ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్లలో ఉన్న ఆలయ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయనే కోణంలో అధికారులు కూపీలాగుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గోదాంలను కమిటీ బృందం పరిశీలించింది.
ఇదీ చూడండి:భవిష్యత్ కార్యాచరణపై సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటా :ఈటల